దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ పూర్తి ఫిట్నెస్తో లేడు. వాండరర్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 15.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు మూడో టెస్టుకు దాదాపుగా దూరమైనట్లే. అతడి ప్లేస్ లో ఉమేశ్, ఇషాంత్ ల్లో ఒకరి చోటు దక్కే అవకాశం ఉంది.