IND VS SA TEAM INDIA SKIPPER VIRAT KOHLI EYES ON HEAD COACH RAHUL DRAVID RECORD SRD
Ind Vs Sa : మూడో టెస్ట్ లో కోచ్ ద్రావిడ్ రికార్డుపై కన్నేసిన కెప్టెన్ కోహ్లీ..
Ind Vs Sa : గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా మారనుంది. ఇక, ఈ మ్యాచ్ ద్వారా ఓ రికార్డు కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాడు కోహ్లీ.
టీమిండియా, దక్షిణాఫ్రికాల (India Vs South Africa) మధ్య సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు ఈ నెల 11న మంగళవారం ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితం తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యమిస్తోంది.
2/ 7
ఈ సిరీస్ లో సెంచురియన్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా(Team India) 113 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ 1-1తో సమం చేసింది. దీంతో.. ఇప్పుడందరి దృష్టి మూడో టెస్టుపై పడింది.
3/ 7
గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా మారనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ద్వారా ఓ రికార్డు కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాడు కోహ్లీ.
4/ 7
సౌతాఫ్రికా పిచ్‌లపై టెస్టుల్లో ద్రవిడ్ 22 ఇన్నింగ్స్‌ల్లో 624 పరుగులు చేశాడు. సగటు 29.71గా ఉంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న విరాట్.. ఇక్కడి పిచ్‌లపై 11 ఇన్నింగ్స్‌ల్లో 611 పరుగులు సాధించాడు.
5/ 7
ఇక ఈ ఆఖరి టెస్టులో మరో 14 పరుగులు సాధిస్తే.. సఫారీ గడ్డపై టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో కోహ్లీ.. ద్రవిడ్‌ను దాటి రెండో స్థానానికి చేరతాడు. కానీ.. అగ్రస్థానానికి చేరడం మాత్రం కష్టమే.
6/ 7
ఎందుకంటే బ్యాటింగ్ దిగ్గజం సచిన్.. సౌతాఫ్రికా పిచ్‌లపై 15 టెస్టులాడి 46.44 సగటుతో 1161 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇందులో ఐదు సెంచరీలు, మూడు అర్ధశతకాలు ఉండటం విశేషం.
7/ 7
ఇక కోహ్లి తన కేరిర్‌లో 99వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో, ఈ మ్యాచ్ ను కైవసం చేసుకుని టీమిండియాకు మరుపురాని విజయాన్ని అందించాలని కోహ్లీ ఉవ్విల్లూరుతున్నాడు.