గురువారం (డిసెంబర్ 16) ఉదయం ముంబై నుండి చార్టర్డ్ విమానంలో దక్షిణాఫ్రికాకు బయలుదేరిన భారత టెస్ట్ జట్టు సాయంత్రం దక్షిణాఫ్రికా చేరుకుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇంతకుముందు జట్టు ముంబై నుంచి బయలుదేరిన చిత్రాలను పంచుకుంది. ఇప్పుడు తాజాగా జట్టు దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన చిత్రాలు కూడా BCCI సోషల్ మీడియా హ్యాండిల్ నుండి షేర్ చేయబడ్డాయి. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాలో భారత్ 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.(BCCI/Twitter)
దక్షణాఫ్రికాలో మూడు టెస్టుల సిరీస్లో ఆడటానికి 18 మంది సభ్యులతో కూడిన జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమైన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను టెస్టులకు దూరమయ్యాడు. అంతే కాకుండా ఇండియా తమ ఇద్దరు ప్రముఖ లెఫ్టార్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లేకుండానే టెస్ట్ సిరీస్ ఆడనున్నది. శుభ్మన్ గిల్ కూడా గాయపడి టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. (BCCI/Twitter)
దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు విరాట్ కోహ్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పర్యటనలో రోహిత్ శర్మను మిస్ అవుతున్నానని చెప్పాడు. రోహిత్ చాలా సమర్థుడైన ఆటగాడని అన్నాడు. రాహుల్ భాయ్ జట్టుతో పాటు ఉండటం గొప్ప బలమని అన్నాడు. వన్డేలు, టీ20ల్లో అతనికి నా 100% మద్దతు లభిస్తుందని చెప్పాడు. (BCCI/Twitter)
దక్షిణాఫ్రికాలో టీమ్ ఇండియా 20 టెస్టులు ఆడింది. అందులో మూడు మాత్రమే గెలవగలిగింది. 2018లో చివరి సారిగా అక్కడ పర్యటించినప్పుడు భారత జట్టు దక్షిణాఫ్రికాకు కఠినమైన పోటీని ఇచ్చింది. కానీ అప్పుడు 1-2తో సిరీస్ను కోల్పోయారు. టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం మూడు జట్లు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మరియు శ్రీలంక) మాత్రమే దక్షిణాఫ్రికాను దాని గడ్డపై ఓడించగలిగాయి.(BCCI/Twitter)