Sunil Gavaskar : ఆ ఒక్కడు తప్ప మిగిలిన వారంతా దండగే.. ఇలాంటి టీమిండియాను చూస్తానని అనుకోలేదు.. దిగ్గజ క్రికెటర్ సంచలన కామెంట్స్
Sunil Gavaskar : ఆ ఒక్కడు తప్ప మిగిలిన వారంతా దండగే.. ఇలాంటి టీమిండియాను చూస్తానని అనుకోలేదు.. దిగ్గజ క్రికెటర్ సంచలన కామెంట్స్
Sunil Gavaskar : బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టోటల్ నే సెట్ చేయగలిగింది. అనంతరం సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను ఆరంభంలోనే దెబ్బ తీసింది. అయినప్పటికీ ఓటమి వైపే నిలిచింది.
సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భారత్ (India) పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టి20లో 211 పరుగులు చేసినా.. చెత్త బౌలింగ్ తో ఓడిపోయిన టీమిండియా.. కటక్ వేదికగా జరిగిన రెండో టి20లోనూ విఫలం అయ్యింది.
2/ 6
బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టోటల్ నే సెట్ చేయగలిగింది. అనంతరం సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను ఆరంభంలోనే దెబ్బ తీసింది. అయినప్పటికీ ఓటమి వైపే నిలిచింది.
3/ 6
మ్యాచ్ అనంతరం దిగ్గజ ప్లేయర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మ్యాచ్ జరిగిన విధానంపై విశ్లేషించాడు. ఈ క్రమంలో టీమిండియా తీవ్రంగా నిరాశ పరిచిందన్నాడు. జట్టులో భువనేశ్వర్ కుమార్ తప్ప వికెట్లు తీసే బౌలరే లేడని కామెంట్ చేశాడు.
4/ 6
149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ తో ఓ ఆట ఆడుకున్నాడు. వెంటవెంటనే మూడు వికెట్లు తీసి విజయం వైపు భారత అడుగు పడేలా చేశాడు. అయితే భువీకి సహకారం అందించే బౌలరే మ్యాచ్ లో కనపడలేదు.
5/ 6
నిన్నటి మ్యాచ్ ను చూస్తే భారత్ ఒక్క బౌలర్ తో ఆడినట్లు కనిపించింది. ఐపీఎల్ హీరోలు యుజువేంద్ర చహల్, అక్షర్ పటేల్ లు తేలిపోయారు. హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లు వేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
6/ 6
భారత తీరు ఇలానే కొనసాగితే.. వైజాగ్ వేదికగా రేపు జరిగే మూడో టి20లోనూ భారత్ ఓడటం ఖాయం. అదే జరిగితే సిరీస్ ను సౌతాఫ్రికా మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంటుంది.