ప్రస్తుతం భారత క్రికెట్ (Team India)లో అందరి నోటా ఎక్కువగా విన్పిస్తోన్న పేరు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). హార్దిక్ సారథ్యంలోని కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఐపీఎల్ 2022 (IPL 2022) ఛాంపియన్ గా అవతరించింది. ఇక.. ఈ సీజన్ లో ఫోర్ డైమన్షల్ గా ప్లేయర్ గా హార్ధిక్ అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత తొలిసారిగా హార్దిక్ భారత జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో హార్దిక్‌దే పెద్ద బాధ్యత. తొలిరోజు ప్రాక్టీస్‌కు హార్దిక్ గైర్హాజరు కావడంతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా మరోసారి హార్దిక్ ఫిట్నెస్ పై అనుమానాలు మొదలయ్యాయ్.