ఇక ఈ సిరీస్ లో పాల్గొనే టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ కాకుండా వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ జరుగుతున్న సమయంలోనే గతేడాది వాయిదా పడ్డ ఐదో టెస్టును ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ కు పయనం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే టెస్టు జట్టును కూడా ప్రకటించింది. ఈ టీమ్ కు కోచ్ గా ద్రవిడ్ వ్యవహరించనున్నాడు.