ఈ ఏడాది టీమిండియా (Team India)కు ఎంతో కీలకం. ఆస్ట్రేలియా (Australia)లో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 WorldCup 2022)లో సత్తా చాటాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. ఇందు కోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్ ఇందుకు వేదిక కానుంది. (Pic Credit: Twitter/BCCI)
ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో దుమ్మురేపిన ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ ద్వారా వారందర్నీ పరీక్షించే అవకాశం దక్కింది. ఈ సిరీస్ లో సత్తా చాటిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక.. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం ఢిల్లీ వేదికగా జరగనుంది. రెండేళ్ల తర్వాత ఈ సిరీస్ ఎలాంటి బయో బబుల్ లేకుండా జరగనుంది. ఇప్పటికే భారత్‌కు చేరిన సౌతాఫ్రికా సిరీస్ విజయమే లక్ష్యంగా ప్రిపేరవుతోంది. (Pic Credit: Twitter/BCCI)
ఇక, తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కడం కష్టమేనని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన వేగంతో బౌలింగ్ చేస్తున్నప్పటికీ అతను నేర్చుకునే దుశలోనే ఉన్నాడని చెప్పాడు.ఉమ్రాన్ కంటే అర్ష్‌దీప్ మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడని పరోక్షంగా పేర్కొన్నాడు. (Pic Credit: Twitter/BCCI)
' ఉమ్రాన్ ఇంకా కుర్రాడే. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. రోజు రోజుకూ మెరుగవుతున్నాడు. ఆడుతున్నకొద్దీ ఇంకా మంచి బౌలర్ అవుతాడు. మాకైతే అతను జట్టులో ఉన్నందుకు సంతోషంగా ఉంది. అతనికి ఎన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వగలమో చూడాలి. మేం వాస్తవికంగా ఉండాల్సిన అవసరముంది. మా జట్టు పెద్దది. అందరికీ తుది జట్టులో చోటివ్వడం కుదరదు. అర్ష్‌దీప్ రూపంలో మరో చక్కని యువ పేసర్ జట్టులో ఉన్నాడు'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. (Pic Credit: Twitter/BCCI)
జూన్ 9 నుంచి 19 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్(Rohit Sharma), కోహ్లీ (Virat Kohli), బుమ్రా (Jasprit Bumragh)లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో దినేష్ కార్తీక్ అనుభవజ్ఞుడు. (Pic Credit: Twitter/BCCI)
ఇక ఆర్సీబీ తరఫున ఫినిషర్‌గా దుమ్మురేపిన దినేశ్ కార్తీక్ సైతం మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. T20 ప్రపంచకప్ ఆడాలంటే అతను ఈ సిరీస్‌లో రాణించడం చాలా ముఖ్యం. అయితే ఇప్పటికే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ జట్టులో ఉన్న నేపథ్యంలో కార్తీక్‌ను ఆడిస్తారా? అనేది డౌట్ గా మారింది. (Pic Credit: Twitter/BCCI)