నెలన్నర రోజులుగా క్రికెట్ ఫ్యాన్స్ కు మజా అందిస్తోన్న ఐపీఎల్ 2022 (IPL 2022) లీగ్ స్టేజీ పూర్తి కావొచ్చింది. మరి కొద్ది రోజుల్లో లీగ్ స్టేజీకి తెరపడునుంది. లీగ్ స్టేజీ ముగిసిన వెంటనే.. ఫ్లే ఆఫ్స్, ఫైనల్ జరగనున్నాయ్. 29వ తేదీన ఫైనల్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. మే 29 ఫైనల్ ముగిసిన తర్వాత, దక్షిణాఫ్రికా జట్టు భారతదేశంలో (India vs South Africa) పర్యటిస్తుంది.
ఈ పర్యటనలో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.
టీమిండియాకు సారథిగా హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేసే ఆలోచన ఉన్నారు బీసీసీఐ సెలెక్టర్లు. ఐపీఎల్ కారణంగా అలిసిపోయిన భారత స్టార్ క్రికెటర్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లందరికీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించడానికి రెడీ అయింది బీసీసీఐ.
కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పర్ఫామెన్స్తో బాగా ఇంప్రెస్ అయిన భారత క్రికెట్ బోర్డు, అతనికి టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తోంది. " రోహిత్, విరాట్, రాహుల్, రిషబ్, జస్ప్రీత్లు పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత 'ఐదో టెస్టు' కోసం ఇంగ్లండ్‌కు బయలుదేరనున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు మా కీలక ఆటగాళ్లందరినీ తాజాగా ఉంచాలి. " అని బీసీసీఐ సెలెక్టర్ ఒకరు చెప్పారు.
ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్ లో తన నాయకత్వ లక్షణాలు బయటపెట్టిన హార్దిక్ .. భవిష్యత్తు టీమిండియా సారథిగా రేసులో నిలవనున్నాడు. గత టీ20 ప్రపంచకప్ ప్రదర్శన తర్వాత హార్థిక్ కు జట్టులో చోటే కష్టమనుకుంటే.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్ గా రేసులో నిలిచాడు. ఇదే కదా సుడి అంటే భయ్యా అని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.