IND vs SA : ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విషయంలో ఆ ప్లేయర్ కు తీవ్ర అన్యాయం? అవార్డు విషయంలో కామెడీ చేశారా?
IND vs SA : ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విషయంలో ఆ ప్లేయర్ కు తీవ్ర అన్యాయం? అవార్డు విషయంలో కామెడీ చేశారా?
IND vs SA : ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఇది సూర్యకుమార్ కెరీర్ లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ గా దీనిని చెప్పవచ్చు.
దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన రెండో టి20లో భారత్ విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ నెగ్గింది. నామమాత్రమైన మూడో టి20 ఇండోర్ వేదికగా జరుగుతుంది.
2/ 8
ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఇది సూర్యకుమార్ కెరీర్ లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ గా దీనిని చెప్పవచ్చు.
3/ 8
అయితే మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ కు అన్యాయం జరిగిందని సగటు క్రికెట్ అభిమాని అనుకుంటున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ కు ఇస్తారని అంతా అనుకున్నారు.
4/ 8
అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ కు కాకుండా కేఎల్ రాహుల్ కు ఇచ్చారు. కేఎల్ రాహుల్ కూడా అర్ధ సెంచరీతో మెరిశాడు. రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు చేశాడు.
5/ 8
భారత్ కు శుభారంభం చేయడంలో కేఎల్ రాహుల్ తన వంతు పాత్ర పోషించాడు. అయితే రాహుల్ పెవిలియన్ కు చేరాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
6/ 8
భారత్ గెలవడానికి ముఖ్య కారణం సూర్యకుమార్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. సూర్యకుమార్ అటువంటి ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే భారత్ 237 పరుగులకు చేరుకునేదే కాదు.
7/ 8
ఒక రకంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ ది మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్. కానీ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మాత్రం సూర్యకు కాదని కేఎల్ రాహులకు ఇవ్వడం చర్చకు తెరలేపింది.
8/ 8
సూర్యకుమార్ యాదవ్ కు అన్యాయం జరిగిందంటూ అతడి అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. అయినప్పటీకి అతడి జట్టు ఓటమి పక్షానే నిలిచింది. (PC : TWITTER)