కేఎల్ రాహుల్ (KL Rahul) చివరి నిమిషంలో గాయంతో తప్పుకోవడంతో దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా (Team India)కు కెప్టెన్ గా రిషభ్ పంత్ (Rishabh Pant) ఎంపికయ్యాడు. సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా.. ఒక్క మ్యాచులో మాత్రమే టీమిండియా విక్టరీ కొట్టింది. కెప్టెన్ గా రిషబ్ పంత్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించిన సందర్భమూ లేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇప్పటివరుకు జరిగిన మూడు మ్యాచుల్లో 40 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ మ్యాచులో 29 పరుగులతో ఫర్వాలేదన్పించాడు. కానీ, మిగతా రెండు మ్యాచుల్లో నిరాశపర్చాడు. రెండో టీ20లో 6 పరుగులు చేసిన పంత్.. వైజాగ్ మ్యాచులో 5 పరుగులు మాత్రమే చేశాడు.
దినేశ్ కార్తీక్ కుర్రాళ్లతో పోటీపడుతున్నాడు. ఇషాన్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి తిరిగి వస్తే పంత్ ను పక్కనపెట్టడమే మంచిదంటున్నారు క్రీడా పండితులు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కెప్టెన్ సంగతి పక్కన పెడితే.. పంత్ కి జట్టులో చోటే కష్టమంటున్నారు.