సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (Ind Vs Sa) టీమిండియా (Team India) దుమ్మురేపింది. మూడో రోజు కూడా భారత్ దే పై చేయి. ఆల్ రౌండ్ షోతో ఫస్ట్ టెస్ట్ పై పట్టు బిగించింది. కేఎల్ రాహుల్ సెంచరీ, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలతో తొలి రోజు బ్యాటర్ల హవా కొనసాగగా.. వర్షం కారణంగా రెండో రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.
ఈ క్రమంలోనే మహ్మద్ షమీ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 55 టెస్టుల్లో షమీ 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. 50 టెస్టుల్లో కపిల్ దేవ్ 200 వికెట్ల మార్క్ సాధించి తొలి స్థానంలో నిలవగా.. జగవల్ శ్రీనాథ్(54 టెస్టుల్లో) రెండో స్థానం, షమీ(55 టెస్టులు) మూడో స్థానం, 63 టెస్టులతో నాలుగో స్థానంలో జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మలు సంయుక్తంగా నిలిచారు.