కెప్టెన్సీ వివాదాన్ని (Captaincy Rift) మర్చిపోయి కోహ్లీ.. ఆఫ్రికాలో భారత జట్టు చరిత్రను మార్చాలనుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేరు. కీలకమైన ఆటగాళ్లు టెస్టు జట్టుకు దూరమైనా దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా ఇండియాకు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాకుండా మొదటి 25 ఓవర్లు ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చాలా కీలకమని, ఓపికతో బ్యాటింగ్ చేయాలని సచిన్ సూచించాడు. తాను చెప్పినట్లు ఆడితే, కొన్ని బంతులు మిస్ కావచ్చు కానీ, ప్రతి బ్యాటర్‌కు కొన్ని బంతులు బీట్ అవుతాయనే విషయం గ్రహించాలననాడు. బౌలర్లు ఉన్నదే అలా బీట్ చేసి, వికెట్లు తీయడానికని సచిన్ హెచ్చరించాడు.
ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ సరిగ్గా పాటించి ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ సక్సెస్ అయ్యారని సచిన్ గుర్తు చేశాడు. వారిద్దరు చేతులను శరీరానికి దూరంగా వెళ్లనీయకుండా జాగ్రత్తపడ్డారని అన్నాడు. అయితే, ఏడాది జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ చెలరేగారు.