ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికాలో (India Vs South Africa) పర్యటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ టెస్ట్ లో సూపర్ విక్టరీతో ను విజయంతో ఆరంభించింది. అయితే, టీమిండియా (Team India)కు మాత్రం గాయాల బెడద తప్పడం లేదు. గాయాలతో ఇప్పటికే లిమిటెట్ ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.
సఫారీలతో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడని సమాచారం. ఈ మేరకు అతడు బీసీసీఐని పర్మిషన్ కూడా కోరినట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్ నుంచి తప్పుకుని కుటుంబంతో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట. దీనికి తోడు గాయం కూడా కావడంతో వన్డే సిరీస్ తప్పుకోని విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీ అనుకుంటున్నాడట.