ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే టి20 ప్రపంచకప్ లో అత్యుత్తమ జట్టును బరిలోకి దింపాలనే ఉద్దేశంతో టీమిండియా మేనేజ్ మెంట్ ఉంది. అందుకోసం అనేక మంది ప్లేయర్లను పరీక్షిస్తోంది. ప్రపంచకప్ లో ఆడాలనే కలను సాకారం చేసుకోవాలంటే దినేశ్ కార్తీక్ తనకు అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది.