T20 World Cup 2022 : టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. మరో బౌలర్ కు గాయం.! అసలేం జరుగుతుంది?
T20 World Cup 2022 : టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. మరో బౌలర్ కు గాయం.! అసలేం జరుగుతుంది?
T20 World Cup 2022 : ఇక తాజాగా మరో బౌలర్ గాయం బారిన పడ్డట్లు సమాచారం. టి20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న దీపక్ చహర్ చీలిమండ ట్విస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు టీమిండియా(Team India)కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వెన్నులో స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంతో భారత (India) స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) టి20 ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు.
2/ 8
ఇక తాజాగా మరో బౌలర్ గాయం బారిన పడ్డట్లు సమాచారం. టి20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న దీపక్ చహర్ చీలిమండ ట్విస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
3/ 8
సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ లో దీపక్ చహర్ ఉన్నాడు. అయితే అతడు తొలి వన్డేలో ఆడలేదు. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే పీటీఐ తన కథనంలో తొలి వన్డే ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో దీపక్ చహర్ చీలిమండ ట్విస్ట్ అయినట్లు పేర్కొంది.
4/ 8
దాంతో అతడు తొలి వన్డే నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కూడా పేర్కొంది. ఇక మిగిలిన రెండు వన్డేల్లో కూడా దీపక్ చహర్ ఆడేది అనుమానంగానే కనిపిస్తుంది. అతడు మరిన్ని టెస్టుల కోసం బెంగళూరులోని NCAకు చేరుకున్నట్లు సమాచారం.
5/ 8
టీమిండియా టి20 ప్రపంచకప్ జట్టులో బుమ్రా స్థానాన్ని దీపక్ చహర్ తో భర్తీ చేస్తారని అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అతడు గాయం బారిన పడ్డాడని వార్తలు రావడంతో టీమిండియా అభిమానుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
6/ 8
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో దీపక్ చహర్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా డెత్ బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఇప్పుడు గాయం వార్త టీమిండియాను కలవర పరుస్తుంది.
7/ 8
బుమ్రా గాయంతో వైదొలగడం.. అదే సమయంలో మొహమ్మద్ షమీపై ఫిట్ నెస్ సందేహాలు నెలకొని ఉండటంతో బుమ్రా ప్లేస్ ను దీపక్ చహరే భర్తీ చేస్తాడని అంతా అనుకుంటున్నారు. చహర్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
8/ 8
టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ నెల 17, 19వ తేదీల్లో రెండు వార్మప్ మ్యాచ్ లను వరుసగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో ఆడనుంది. ఇక 23న పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ తో తన ప్రపంచకప్ వేటను ఆరంభించనుంది.