T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ లో కొత్త ట్విస్ట్.. 23న IND vs PAK మ్యాచ్ జరిగేది అనుమానమే! కారణం ఇదే
T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ లో కొత్త ట్విస్ట్.. 23న IND vs PAK మ్యాచ్ జరిగేది అనుమానమే! కారణం ఇదే
IND vs PAK-T20 World Cup 2022 : ఇక 23న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని క్రేజ్. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ దేశాల్లో అయితే ఆ రోజు రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా అక్టోబర్ 16న ధనాధన్ సమరానికి తెర లేవడనుంది. అక్టోబర్ 22 నుంచి అసలైన సమరం మొదలు కానుంది.
2/ 8
ఇక 23న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని క్రేజ్. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ దేశాల్లో అయితే ఆ రోజు రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది.
3/ 8
వ్యూయర్ షిప్ పరంగా రికార్డులు బ్రేక్ కూడా అవుతాయి. అందుకే ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడేలా నిర్వహకులు జాగ్రత్త పడుతున్నారు. అక్టోబర్ 23 మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే 90 వేల టికెట్లు పైగా అమ్ముడయ్యాయి.
4/ 8
అయితే ఈ మ్యాచ్ పై నీలి నీడలు అలముకున్నాయి. అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేది అనుమానమే. ఇందుకు కారణం వర్షం. భారత్, పాక్ మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా విఖ్యాత స్టేడియం ఎంసీజీలో జరగనుంది.
5/ 8
అయితే మెల్ బోర్న్ లో వచ్చే గురువారం నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (అక్టోబర్ 23న) భారీ వర్ష సూచన చేసింది. అంతేకాకుండా మెల్ బోర్న్ లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనను కూడా జారీ చేశారు. (PC : TWITTER)
6/ 8
వారు తక్షణమే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని కూడా అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. అదే జరిగితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే. (PC : TWITTER)
7/ 8
ఆస్ట్రేలియాలో ఇప్పుడు వేసవి కాలం. అయినప్పటికీ మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు ఎండాకాలంటో కూడా అక్కడ కురుస్తున్నాయి. 2019-2020 మధ్య కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియా అడవులు తగలబడిన సంగతి తెలిసిందే. (PC : TWITTER)
8/ 8
ఇక టి20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు అక్టోబర్ 17, 19వ తేదీల్లో రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడనుంది. తొలుత ఆస్ట్రేలియాతో ఆ తర్వాత న్యూజిలాండ్ తో భారత్ వార్మప్ మ్యాచ్ లను ఆడనుంది.