భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ లు తలపడుతున్నాయంటే అది బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక పురుషుల క్రికెట్ లో ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే అది ఊహించని బ్లాక్ బాస్టర్. ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది. ఇక.. లేటెస్ట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఇంటర్వ్యూ సందర్భంగా పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్ధుల్ రజాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. " టీమ్ ఇండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. సచిన్ టెండూల్కర్ కూడా తక్కువోడి ఏం కాదు. సెహ్వాగ్-సచిన్ జోడీకి వ్యతిరేకంగా పాక్ జట్టు బౌలింగ్ కోసం ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఈ ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేస్తే మ్యాచ్ గెలుస్తామన్నది మా ప్లాన్.' అని తెలిపాడు.(AFP)
సచిన్, సెహ్వాగ్‌లు పాకిస్థాన్‌పై ఎన్నో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఒక బ్యాట్స్‌మెన్ అవుట్ అయితే.. మరొకరు ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించారు. ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై సచిన్ 194 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో అతను డబుల్ సెంచరీని కోల్పోయాడు. AP