* వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ : శ్రీలంకతో వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సత్తా చాటాడు. టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాడు. లంకతో మూడు మ్యాచ్‌ల్లో 69 సగటుతో 207 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ, సెంచరీ కూడా ఉంది. ఈ క్రమంలో గిల్ ఒక చారిత్రక రికార్డుకు దగ్గరయ్యాడు. ఇప్పటి వరకు అతడు కేవలం 18 ఇన్నింగ్స్‌లలో 59.6 సగటుతో 894 పరుగులు సాధించాడు. అయితే 1000 వన్డే పరుగులు పూర్తి చేయడానికి ఈ యంగ్ ప్లేయర్‌కు కేవలం 106 రన్స్ అవసరం.
న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో గిల్ ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా 1000 వన్డే రన్స్ (ఇన్నింగ్స్ పరంగా) చేరుకున్న ఇండియన్ బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఈ ఢిల్లీ బ్యాటర్లు ఇద్దరూ తమ 24వ వన్డే ఇన్నింగ్స్‌లో నాలుగు అంకెల మార్కును చేరుకున్నారు.
షమీ ప్రస్తుతం ఈ ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్స్‌లో 11వ స్థానంలో ఉన్నాడు. అయితే తాజా సిరీస్‌లో ఈ వెటరన్ సీమర్.. వన్డేల్లో టాప్-10 లీడింగ్ ఇండియన్ వికెట్ టేకర్‌గా నిలిచే అవకాశం ఉంది. షమీ కనీసం మూడు వికెట్లు పడగొడితే.. మనోజ్ ప్రభాకర్ (157 వన్డే వికెట్లు)ను అధిగమిస్తాడు. తద్వారా 50 ఓవర్ల క్రికెట్లో మరో మైలురాయిని చేరుకుంటాడు.