సొంత గడ్డపై న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా (Team India) సత్తా చాటింది. వరుసగా రెండు వన్డేలు గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో కివీస్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 108 పరుగులకే కట్టడి చేసిన ఇండియా.. టార్గెట్‌ను ఈజీగా ఛేదించింది.
* విరాట్ కోహ్లీ స్థానంలో రజత్ పాటిదార్ : స్పిన్ బౌలింగ్‌ను ఆడేందుకు విరాట్ కోహ్లి ఇబ్బంది పడుతున్నట్లు చాలా చర్చలు జరిగాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి రెండు వన్డేలలో అదే తీరు కనిపించింది. మిచెల్ సాంట్నర్ రెండు మ్యాచ్‌లలోనూ కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడాలని సీనియర్లు సూచిస్తున్నారు.
కానీ అతన్ని కివీస్‌తో జరిగిన రెండు వన్డేలకు దూరం పెట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే వన్డే సిరీస్ సొంతమవడంతో మహ్మద్ షమీ ప్లేస్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోవచ్చు. కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ దాదాపు రెండు వారాల్లో ప్రారంభం కానుంది. దీంతో షమీకి తగినంత విశ్రాంతి ఇవ్వాలని టీమ్ భావించవచ్చు.