బీసీసీఐ, సెలెక్షన్ కమిటీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలే దీనికి ప్రధాన కారణం. ఆటగాళ్లపై సెలెక్టర్లకు ఉన్న ఇష్టం, అయిష్టంతో ఇలా చేశారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ 2018లో దుమ్మురేపిన అంబటి రాయుడు టీమిండియాలోకి అడుగుపెట్టాడు. 2019 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా అతన్ని నాలుగో స్థానంలో ఆడించేందుకు టీమ్మేనేజ్మెంట్ అవకాశాలు ఇచ్చింది.