నవంబర్ 25న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ భారత్‌ను ఓడించింది. దీని తర్వాత మరోసారి భారత్‌తో తలపడేందుకు న్యూజిలాండ్ జట్టు సిద్ధమైంది. అంతకు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. (PC: blackCaps)
1969 అక్టోబర్ 3 నుంచి 8 వరకు నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ గ్రాహమ్ డౌలింగ్ మ్యాచ్ గెలిపించాడు. ఆ తర్వాత 19 ఏళ్లకు 1988 నవంబర్ 24 నుంచి 29 వరకు ముంబైలో మ్యాచ్ గెలిచింది. అప్పడు కివీస్‌కు కెప్టెన్‌గా జాన్ రైట్ ఉన్నాడు. 1988 తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. (PC: ICC)
1988 నుంచి ఇరు జట్లు ఇండియాలో 17 టెస్టులు ఆడాయి. వాటిలో 9 ఓడిపోయి 8 డ్రా చేసుకుంది. న్యూజిలాండ్ ఇప్పటి వరకు భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెలవలేదు. భారత్‌లో 34 టెస్టులు ఆడగా కివీస్ కేవలం 2 మాత్రమే గెలిచింది. గత 7 టెస్టుల్లో ఓడిపోయింది. 2 టెస్టుల్లో న్యూజీలాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. (Twitter)
న్యూజిలాండ్ 1955లో భారత్‌లో తన తొలి టెస్టు ఆడింది. అంటే గత 66 ఏళ్లలో భారత్‌లో ఎన్నడూ టెస్టు సిరీస్ గెలవలేదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టు ఆడనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు కూడా విశ్రాంతి లభించింది. (PC: Twitter)
ఇప్పటివరకు న్యూజిలాండ్‌కు చెందిన 10 మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా భారత్‌లో టెస్టులు ఆడగా, వారిలో ఇద్దరు మాత్రమే టెస్టు మ్యాచ్‌లు గెలుపొందారు. ఇక మిగిలిన 8 మందిలో ఒక్క కెప్టెన్ కూడా టెస్టు గెలవలేదు. కెన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ ఇప్పటి వరకు భారత్‌లో ఒక్క టెస్టు కూడా గెలవలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. (PC: ICC)
రాస్ టేలర్ కెప్టెన్‌గా భారత్‌లో అత్యధికంగా 3 టెస్టులు ఓడిపోయాడు. భారత్, న్యూజిలాండ్‌లు ఇప్పటి వరకు 60 టెస్టులు ఆడగా, అందులో 21 టెస్టులు భారత్, 13 న్యూజిలాండ్‌లు గెలుపొందాయి. ఇక సీనియర్ ఆటగాళ్లు గైర్హాజరీలో భారత జట్టు యువకులతో బరిలోకి దిగుతున్నది. దీంతో ఈ సారి టెస్ట్ సిరీస్ గెలవడానికి న్యూజీలాండ్‌కు మంచి అవకాశం ఉన్నది. (PC: ICC)