Lucknow Pitch : ఇవేం పిచ్ లు రా బాబు! పొలాల్లో క్రికెట్ ఆడినట్లుంది.. ఐపీఎల్ లో ఇలానే ఉంటుందా?
Lucknow Pitch : ఇవేం పిచ్ లు రా బాబు! పొలాల్లో క్రికెట్ ఆడినట్లుంది.. ఐపీఎల్ లో ఇలానే ఉంటుందా?
Lucknow Pitch : అయితే తాజాగా భారత్ లో జరుగుతున్న మ్యాచ్ లను చూస్తే టి20లకు కొత్త అర్థం వచ్చేలా కనిపిస్తుంది. ముఖ్యంగా లక్నో వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ రెండో టి20 అయితే టెస్టు మ్యాచ్ లా సాగింది.
టి20 మ్యాచ్ అంటే ప్రతి అభిమాని కూడా ధనాధన్ బ్యాటింగ్ ను ఎక్స్ పెక్ట్ చేస్తాడు. బౌండరీల వర్షం కురుస్తుందని అనుకుంటాడు. బ్యాటర్ల మెరుపులు ఉంటాయి కాబట్టే టి20 ఫార్మాట్ సూపర్ సక్సెస్ అయ్యింది.
2/ 8
అయితే తాజాగా భారత్ లో జరుగుతున్న మ్యాచ్ లను చూస్తే టి20లకు కొత్త అర్థం వచ్చేలా కనిపిస్తుంది. ముఖ్యంగా లక్నో వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ రెండో టి20 అయితే టెస్టు మ్యాచ్ లా సాగింది.
3/ 8
అందుకు ముఖ్య కారణం పిచ్. బంతి ఎంతలా టర్న్ అవుతుందంటే.. ఒక పిచ్ పై బాల్ వేస్తే.. దాని పక్కన ఉన్న పిచ్ మీదకు వెళ్లిపోతుంది. ఆదివారం 39.5 ఓవర్ల ఆట జరిగితే స్పిన్నర్లు 30 ఓవర్లు వేశారు. మిగిలిన 9.5 ఓవర్లను పేసర్లు వేశారు.
4/ 8
ఇక న్యూజిలాండ్ అయితే 17 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఆఖరికి స్వతహాగా వికెట్ కీపర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ కూడా 4 ఓవర్లు వేశాడు. ఇక మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 99 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో పూర్తి చేసింది.
5/ 8
ఇక ఈ మ్యాచ్ లో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు. పొలాల్లో క్రికెట్ ఆడినట్లు కనిపించింది. ధనాధన్ బ్యాటింగ్ ను చూడాలని గ్రౌండ్ కు వచ్చిన అభిమానులకు లక్నో పిచ్ పెద్ద షాక్ నే ఇచ్చింది.
6/ 8
మొన్నటికి మొన్న రాయ్ పూర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లో వాడిన పిచ్ పై చాలా మంది అభిమానులు పెదవి విరిచారు. వన్డే కోసం టెస్టు పిచ్ ను తయారు చేశారంటూ కామెంట్స్ చేశారు.
7/ 8
ఇక తాజాగా లక్నో పిచ్ పై స్వయంగా టీమిండియా సారథి హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. పిచ్ ను చూసి షాక్ అయ్యానని పేర్కొన్నాడు. కష్టమైన పిచ్ లు ఉండాలి కాని మరీ ఇలాంటి నాసిరకమైన పిచ్ లను తయారు చేయరాదన్నాడు.
8/ 8
టి20లకు ఇలాంటి పిచ్ లను తయారు చేయరాదని.. క్యూరేటర్లు ఇలాంటి తప్పులు మళ్లీ చేయకూడదంటూ సున్నితంగా మందలించాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయి ఉంటే మాత్రం పిచ్ పై రగడ తీవ్ర స్థాయిలో జరిగి ఉండేది.