దాంతో సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితం అయ్యింది. భారత టాపార్డర్ విఫలం కాగా.. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (28 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ ఆఖర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో టీమిండియా ఓటమి పక్షాన నిలిచింది.