కివీస్ తో జరిగిన రెండో టీ20లో కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ కి టీ20ల్లో ఇది రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్ లో కూడా తన 360 డిగ్రీ మార్క్ షాట్లతో అలరించాడు. దీంతో.. టీ20 క్రికెట్ నయా మాన్స్టర్ గా అవతరించాడు. దీంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక, సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ 217.65. మిగతా టీమిండియా బ్యాటర్ల స్ట్రైక్ రేట్ మొత్తం కలిపితే 100. సూర్య 51 బంతుల్లో 111 పరుగులు చేస్తే.. మిగతా టీమిండియా బ్యాటర్లు 69 బంతుల్లో 69 పరుగులు చేశారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లు 113 బంతుల్లో 118 పరుగులు చేశారు. అంటే వారి స్ట్రైక్ రేట్ 104.42. ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది సూర్య ఎలా విజృంభించాడో.