ఇక న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో గిల్ 112 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలో పలు ప్రపంచ రికార్డుల్లో భాగం అయ్యాడు. భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో నాలుగు శతకాలు బాదిన ప్లేయర్ గా గిల్ నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్ 24 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. గిల్ 21 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్ గా మాత్రం నాలుగో స్థానంలో నిలిచాడు.
తాజాగా ఈ రికార్డును గిల్ తన పేరిట లిఖించుకున్నాడు. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో గిల్ 3 మ్యాచ్ ల్లో 360 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరసన నిలిచాడు. బాబర్ 2016 విండీస్ సిరీస్‌లో 360 పరుగులు చేయగా.. గిల్ ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో అన్నే పరుగులు చేశాడు.