* తన రికార్డును తానే బ్రేక్ చేసిన భారత్ : టీ20ల్లో టెస్టు ఆడే దేశంపై భారత్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 2018లో ఐర్లాండ్‌పై ఇండియా 143 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. 2018లో పాకిస్థాన్ కూడా వెస్టిండీస్‌పై 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా కివీస్‌పై మూడో టీ20లో భారత్ 168 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
* అత్యల్ప పరుగుల రికార్డు సాధించిన కివీస్ : నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో కేవలం 66 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. కివీస్ భారత్‌తో జరిగిన టీ20లో అత్యల్ప స్కోరు చేసిన రికార్డును సాధించింది. 2018లో డబ్లిన్‌లో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్ అయింది. ఈ రికార్డును న్యూజిలాండ్ అధిగమించింది.
* రైనాను అధిగమించిన శుభ్‌మన్ గిల్ : న్యూజిలాండ్‌పై అన్ని ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేయర్‌గా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. గిల్ 23 ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. అతి తక్కువ వయసులో అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ప్రపంచ రికార్డు ఇప్పటికీ అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. అతను 22 సంవత్సరాలకే ఈ ఫీట్ అందుకున్నాడు.
* కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన గిల్ : కివీస్‌తో జరిగిన మూడో టీ20లో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన గిల్ 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. టీ20లలో అత్యధిక స్కోర్ చేసిన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. గతేడాది ఆఫ్ఘనిస్థాన్‌పై విరాట్ కోహ్లి 122 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.