IND vs NZ T20 Series : న్యూజిలాండ్ తో తొలి టి20.. స్టార్ స్పోర్ట్స్, సోనీ చానెల్స్ లో నో లైవ్.. ఎక్కడ చూడాలంటే?
IND vs NZ T20 Series : న్యూజిలాండ్ తో తొలి టి20.. స్టార్ స్పోర్ట్స్, సోనీ చానెల్స్ లో నో లైవ్.. ఎక్కడ చూడాలంటే?
IND vs NZ T20 Series : నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టి20 జరగనుంది. అనంతరం నవంబర్ 20, 22వ తేదీల్లో మిగిలిన రెండు టి20 జరుగుతాయి. ఈ సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసిన తర్వాత భారత్ (India) కీలక సిరీస్ కు సిద్ధమైంది. సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీ, రాహుల్ లు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. దాంతో టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా.. వన్డేలకు శిఖర్ ధావన్ సారథులుగా వ్యవహరించనున్నారు.
2/ 7
నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టి20 జరగనుంది. అనంతరం నవంబర్ 20, 22వ తేదీల్లో మిగిలిన రెండు టి20 జరుగుతాయి. ఈ సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
3/ 7
నవంబర్ 25, 27, 30వ తేదీల్లో మూడు వన్డేలు జరగుతాయి. దీనికి సారథిగా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్, సోనీ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు.
4/ 7
ఈ సిరీస్ ను అధికారికంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అంటే ఈ మ్యాచ్ లను చూడాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉండాల్సి ఉంది.
5/ 7
అమెజాన్ సబ్ స్క్రిప్షన్ లేని వాళ్ల పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారా? వారు కూడా ఈ మ్యాచ్ లను లైవ్ చూడొచ్చు. స్పోర్ట్స్ యాక్ట్ కింద భారత్ ఎక్కడ మ్యాచ్ లు ఆడుతున్నా లైవ్ టెలికాస్ట్ చేసే బ్రాడ్ కాస్టర్ దూరదర్శన్ తో లైవ్ ను పంచుకోవాల్సి ఉంది. (PC : TWITTER/DD)
6/ 7
ఫలితంగా ఈ మ్యాచ్ లను డీడీ స్పోర్ట్స్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇంగ్లీష్ కామెంట్రీ వినాలనుకుంటే మాత్రం అమెజ్ ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.
7/ 7
భారత్, కివీస్ జట్ల మధ్య తొలి టి20 నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. (PC : TWITTER/DD)