SuryaKumar Yadav : క్రికెట్ న్యూ సెన్సేషన్.. సూర్య భాయ్ దెబ్బకు కోహ్లీ రికార్డు ఫసక్
SuryaKumar Yadav : క్రికెట్ న్యూ సెన్సేషన్.. సూర్య భాయ్ దెబ్బకు కోహ్లీ రికార్డు ఫసక్
SuryaKumar Yadav : ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20లోనూ సూర్యకుమార్ దంచి కొట్టాడు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులతో అజేయ శతకం సాధించాడు. ఇందులో 11 పోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం.
సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) ప్రస్తుతం టీమిండియా (Team India) అభిమానులు జపిస్తోన్న పేరు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. బౌలర్ ఎవరైనా సరే తన ట్రేడ్ మార్క్ షాట్లతో పరుగులు సాధిస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు.
2/ 8
ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20లోనూ సూర్యకుమార్ దంచి కొట్టాడు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులతో అజేయ శతకం సాధించాడు. ఇందులో 11 పోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం.
3/ 8
ఇక ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 191 పరుగులు చేసింది. బదులుగా న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ 65 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.
4/ 8
ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటికే అంతర్జాతీయ టి20 ఫార్మాట్ లో ఈ ఏడాది (2022) అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.
5/ 8
సూర్యకుమార్ 111 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ గెల్చుకున్న 7వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం.
6/ 8
ఈ క్రమంలో కోహ్లీ పేరిట ఉన్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 2016లో అంతర్జాతీయ క్రికెట్ లో ఏకంగా 6 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
7/ 8
దాంతో ఒక ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో (మూడు ఫార్మాట్లను కలిపి) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న భారత ప్లేయర్ గా కోహ్లీ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాడు.
8/ 8
తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఏడోసారి ఆ అవార్డును అందుకున్నాడు. అంతేకాకుండా కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు.