IND vs NZ : ‘అందుకే అతడిని తీసుకోలేదు’ రెండో వన్డే నుంచి సామ్సన్ ను తప్పించడంపై ధావన్ వివరణ
IND vs NZ : ‘అందుకే అతడిని తీసుకోలేదు’ రెండో వన్డే నుంచి సామ్సన్ ను తప్పించడంపై ధావన్ వివరణ
IND vs NZ : పిచ్ మరీ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇరు జట్ల కెప్టెన్ లకు తెలిపారు. తొలి వన్డేలో నెగ్గిన ఇంగ్లండ్ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఇన్నింగ్స్ 29 ఓవర్ల చొప్పున మ్యాచ్ ను కుదించినా.. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 12.5 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది.
2/ 9
పిచ్ మరీ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇరు జట్ల కెప్టెన్ లకు తెలిపారు. తొలి వన్డేలో నెగ్గిన ఇంగ్లండ్ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
3/ 9
ఇక రెండో వన్డే కోసం సంజూ సామ్సన్ పై టీమిండియా వేటు వేసింది. అతడి స్థానంలో దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకుంది. దాంతో భారత అభిమానులు టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
4/ 9
ఇక మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ సంజూ సామ్సన ను తప్పించడంపై వివరణ ఇచ్చుకున్నాడు. తాము అదనపు బౌలర్ తో బరిలోకి దిగాలనుకున్నామని.. దాంతో సామ్సన్ ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
5/ 9
అంతేకాకుండా దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దంటూ కొంతముంది టీమిండియా అభిమానులకు చురకలు అంటించాడు. సంజూ సామ్సన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఆకట్టుకుంటున్నాడు.
6/ 9
సౌతాఫ్రికాపై జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడిన అతడు న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో కష్ట సమయంలో బ్యాటింగ్ కు వచ్చి 36 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
7/ 9
అదనపు బౌలర్ కోసం సామ్సన్ ను తప్పించామని ధావన్ చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానుల్లో మరింత అగ్గిని రాజేశాయి. అదనపు బౌలర్ ను ఆడించాలనుకుంటే సామ్సన్ నే తప్పించాలా? వేరే ప్లేయర్ ను తప్పించలేరా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
8/ 9
పంత్ గత కొంత కాలంగా అటు వన్డే, ఇటు టి20ల్లో పెద్దగా రాణించింది లేదు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. పంత్ స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
9/ 9
సంజూ సామ్సన్ కీపింగ్ కూడా చేయగలడు. పంత్ కంటే మెరుగ్గా కీపింగ్ చేయగలడు. ఫామ్ లో లేని పంత్ కు బ్రేక్ ఇచ్చి సంజూ సామ్సన్ కు ఆడే అవకాశం ఇచ్చి ఉండాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే సామ్సన్ పై వివక్ష చూపుతున్నారంటూ కూడా మరికొందరు టీమిండియాపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.