టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2022) సెమీస్ లో దారుణ నిష్క్రమణ తర్వాత టీమిండియా (Team India) మరో కీలక సిరీస్ కు సిద్ధమైంది. న్యూజిలాండ్ (New Zealand) తో వారి గడ్డపై అమీతుమీ తేల్చుకోనుంది. మూడు టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇప్పుడు రెండో టీ20 మ్యాచులో సత్తా చాటేందుకు రెడీ అయింది టీమిండియా.
ధోనిలా కూల్ గా ఉండే అతడు ఫినిషర్ గా జట్టుకు అక్కరకు వస్తాడు. ఈ మధ్య జరిగిన సిరీస్ ల్లో పంత్, కిషన్ కంటే కూడా సంజూ సామ్సన్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఆడాడు. అయితే పంత్ కు దక్కినట్లు వరుసగా సంజూ సామ్సన్ కు అవకాశాలు దక్కలేదు. అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే టీమిండియాకు మరో ధోని కావడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.