IND vs NZ : టీమ్ కాంబినేషన్ కోసం ఫామ్ లో ఉన్న ఆటగాడు బలి.. ఆ ఫ్లాప్ స్టార్ కి మాత్రం ఛాన్సులే ఛాన్సులు..!
IND vs NZ : టీమ్ కాంబినేషన్ కోసం ఫామ్ లో ఉన్న ఆటగాడు బలి.. ఆ ఫ్లాప్ స్టార్ కి మాత్రం ఛాన్సులే ఛాన్సులు..!
IND vs NZ : జట్టు ఆడే ప్రధాన సిరీస్ లకు ఇతడు దూరంగానే ఉంటున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సమయాల్లోనే టీమిండియాకు ఎంపికవుతున్నాడు. అప్పుడు కూడా అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో రెగ్యులర్ గా చోటు దక్కుతుందా అంటే లేదనే చెప్పాలి.
సంజూ సామ్సన్ (Sanju Samosn).. టెక్నిక్ తో పాటు దూకుడుగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్. టీంలో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్. ఎంతో ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ కు అవకాశాలు అయితే రావడం లేదు.
2/ 9
జట్టు ఆడే ప్రధాన సిరీస్ లకు ఇతడు దూరంగానే ఉంటున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సమయాల్లోనే టీమిండియాకు ఎంపికవుతున్నాడు. అప్పుడు కూడా అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో రెగ్యులర్ గా చోటు దక్కుతుందా అంటే లేదనే చెప్పాలి.
3/ 9
దీంతో.. ప్రస్తుతం న్యూజిలాండ్ తో టి20, వన్డే సిరీస్ లకు ఎంపికయ్యాడు. కానీ, ఏం ప్రయోజనం. టీ20 సిరీస్ లో సంజూ శాంసన్ కు నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ లో అతడు ఆడతాడని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు.
4/ 9
ఇక వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సంజూ సామ్సన్ ఆకట్టుకున్నాడు. 36 పరుగులు చేశాడు. కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 36 పరుగులతో ఆకట్టుకున్న సంజూ శాంసన్ కు రెండో వన్డే లో చోటు దక్కడం ఖాయమనుకున్నారు.
5/ 9
కానీ, మరోసారి సంజూకి నిరాశ తప్పలేదు. జట్టు కాంబినేషన్ కోసం సంజూ శాంసన్ పై వేటు వేశారు. అతడి స్థానంలో దీపక్ హుడాకి స్థానం కల్పించారు. హుడాకి జట్టులో చోటు ఇవ్వడం కరెక్టే.. కానీ.. సంజూని తప్పించాల్సిన అవసరం ఏముందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
6/ 9
మరోవైపు ఫామ్ లో లేకుండా జట్టుకు భారంగా తయారైన పంత్ కు మాత్రం వరుస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు. అతడికి ఇచ్చినన్ని అవకాశాల్లో కనీసం పావు వంతైనా సామ్సన్ కు ఇచ్చి ఉంటే టీమిండియాకు మంచి జరిగి ఉండేదని అభిమానులు పేర్కొంటున్నారు.
7/ 9
ఫస్ట్ వన్డేలో రిషభ్ పంత్ కేవలం 15 పరుగులకే వెనుదిరిగాడు. కానీ.. రెండో వన్డేలో అతడికి ఛాన్స్ ఇచ్చారు. టీంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా ఎప్పుడు ఏ షాట్ ఆడాలో తెలియని అయోమయ స్థితిలో పంత్ ఉన్నాడు.
8/ 9
పంత్ ని ఎంత బ్యాక్ చేసిన ఉపయోగం లేదనే స్థితికి అందరూ వచ్చారు. ఈ రుద్దుడు స్టార్ కేవలం వైస్ కెప్టెన్ హోదాలో చోటు దక్కించుకుంటున్నాడు. మరోవైపు.. ఫాంలో ఉన్న సంజూ శాంసన్ కు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు.
9/ 9
ఇక బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు కూడా శాంసన్ ఎంపిక కాలేదు. ఈ క్రమంలో ఎంతో ట్యాలెంట్ ఉన్న సంజూ శాంసన్ ను ఉపయోగించుకోవడంలో టీమిండియా విఫలం అవుతుందనే చెప్పాలి.ప్రతిభకు ఏ లోటు లేని ఈ ప్లేయర్ టీమిండియా మేనేజ్ మెంట్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు బలవుతున్నాడు.