దాదాపుగా 125 అంతర్జాతీయ మ్యాచ్ లు (మూడు ఫార్మాట్లు కలుపుకుని) ఆడేశాడు. పంత్ కు దక్కినట్లు వేరే ప్లేయర్ కు అవకాశాలు దక్కి ఉంటే ఈపాటికి అతడు స్టార్ ప్లేయర్ లా ఎదిగేవాడు. నాలుగేళ్లకు పైగా అంతర్జాతీయ అనుభవం ఉన్నా ఇప్పటికీ ఎప్పుడు ఏ షాట్ ఆడాలో తెలియని ప్లేయర్ గా పంత్ ఉన్నాడు. ఒక టెస్టుల్లో మినహా పరిమిత ఓవర్ల క్రికెట్ లో పంత్ సక్సెస్ అయిన దాఖలాలు కనిపించవు.
6, 6, 11, 15, 10.. గత ఐదు మ్యాచ్ ల్లో పంత్ బ్యాటింగ్ ప్రదర్శన ఇది. ఇంత పూర్ ఫామ్ లో ఉన్నా అతడికి అవకాశాల మీద అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. అయినా కూడా పంత్ ఫామ్ లోకి రావడం లేదు. అతడికి ఇచ్చినన్ని అవకాశాల్లో కనీసం పావు వంతైనా సామ్సన్ కు ఇచ్చి ఉంటే టీమిండియాకు ఇప్పటికే మంచి ఫినిషర్ దొరికేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.