న్యూజిలాండ్ తో జరిగిన టీ-20 సిరీస్ ను 1-0 తేడాతో టీమిండియా (Team India) కైవసం చేసుకుంది.తొలి టీ20 వర్షార్పాణం కాగా, రెండో టీ20 సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) గెలిపించాడు, ఒక మూడో టీ20ల్లో ఓటమి పలకిరిస్తున టైమ్ వర్షం వచ్చి.. టీమిండియాను కాపాడింది. దీంతో 1-0తో సిరీస్ మన సొంతమైంది. అయితే, టీమిండియా తుది జట్టు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుగా చెప్పుకుంటున్న ఉమ్రాన్ మాలిక్, సంజు శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సంజూ సామ్సన్ (Sanju Samosn).. టెక్నిక్ తో పాటు దూకుడుగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్. టీంలో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్. ఎంతో ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ కు అవకాశాలు అయితే రావడం లేదు.
దీంతో.. ప్రస్తుతం న్యూజిలాండ్ తో టి20, వన్డే సిరీస్ లకు ఎంపికయ్యాడు. కానీ, ఏం ప్రయోజనం. టీ20 సిరీస్ లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ సంజూ శాంసన్ కు నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ లో అతడు ఆడతాడని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. ఇక బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు. ఈ క్రమంలో ఎంతో ట్యాలెంట్ ఉన్న సంజూ శాంసన్ ను ఉపయోగించుకోవడంలో టీమిండియా విఫలం అవుతుందనే చెప్పాలి.