అయితే రోహిత్ మాత్రం పరుగుల కోసం బౌండరీల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు గావస్కర్ పేర్కొన్నాడు. కోహ్లీ ఎక్కువగా నేల మీదే షాట్లు ఆడితే.. రోహిత్ మాత్రం గాల్లోకి ఆడతాడని పేర్కొన్నాడు. వికెట్ల మధ్య పరుగులు రాకపోవడంతో రోహిత్ ఒత్తిడిలోకి వెళ్లి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ ను పారేసుకుంటున్నాడని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
కోహ్లీ మాత్రం అలా చేయడం లేదని తెలిపాడు. అందుకు ఉదాహరణగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ బ్యాటింగ్ ను చూపాడు. సెంచరీ వరకు కోహ్లీ నేలమీదే ఎక్కువ షాట్లు ఆడాడడని.. అదే క్రమంలో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ పరుగులు రాబట్టాడని చెప్పాడు. సెంచరీ తర్వాత సిక్సర్ల వేట స్టార్ట్ చేశాడని గావస్కర్ వ్యాఖ్యానించాడు.