టీ-20 వరల్డ్ కప్ పరాభవం తర్వాత టీం కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకొన్నాడు. రవిశాస్త్రీ పదవీ కాలం ముగియడంతో రాహుల్ ద్రావిడ్‌ను టీం కోచ్‌గా నియమించారు. ద్రావిడ్ రాకతో టీంలో సీరియస్ నెస్ ఏర్పాడింది. అంతే కాకుండా సీనియర్ ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి నిచ్చారు. దీంతో జూనియర్ ప్లేయర్లు తమను నిరుపించుకోవడానికి తాపత్రయ పడ్డారు. ఆ యంగ్ క్రికెటర్లందరికీ అండగా రోహిత్ శర్మ నిలిచాడు.
ఈ సిరీస్ లో సరికొత్త టీమిండియా అభిమానుల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. బలమైన న్యూజిలాండ్ జట్టును వరుసగా మూడు మ్యాచ్‌లల్లో మట్టికరిపించడం అంటే మాటలు కాదు. అలాంటి పనిని అలవోకగా పూర్తి చేసిందీ యంగ్ ఇండియా టీమ్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేని ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ.. విజయంపై ఎలాంటి అనుమానాలు కలగలేదు.
మూడు మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించడమే కాదు.. మూడుసార్లూ టాస్‌ను గెలిచాడు రోహిత్ శర్మ. జైపూర్, రాంచీలతో పాటు కోల్‌కత మ్యాచ్‌లోనూ టాస్ రోహిత్ శర్మనే వరించింది. ఇదో రికార్డు. వరుసగా మూడుసార్లు టాస్ గెలవడం, ఆ మ్యాచ్‌లన్నింట్లోనూ టీమిండియా విజయాన్ని అందుకోవడం రికార్డే. టాస్ అండ్ మ్యాచ్ విన్నింగ్ రేషియో అనేది రోహిత్ శర్మ ఖాతాలో 100 శాతంగా రికార్డయింది.
టీమిండియా టీ20 ఫార్మట్ మాజీ కెప్టెన్ వల్ల విరాట్ కోహ్లీ వల్ల ఇది సాధ్యమే కాలేదు. విరాట్ కోహ్లీ సారథిగా టాస్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య తక్కువే. టాస్ గెలవడానికి మొహం వాచిన మ్యాచ్‌లు అనేకం. విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవడం ఖాయమంటూ ఇదివరకు సోషల్ మీడియాలో మెమెలు కూడా వెల్లువెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. టాస్‌ను గెలిచే అదృష్టం విరాట్ కోహ్లీకి పరిమితంగానే దక్కింది.