టీమిండియా నయా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పర్యవేక్షణలో.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్ (New Zealand)ను చిత్తు చేసింది. దాంతో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఇక మూడో టీ20 ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ యువ క్రికెటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సిరీస్ గెలిచిన సంతోషంలో అందరూ ఫుల్‌గా పార్టీ చేసుకోవచ్చని అన్నాడు. నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు వీరిలో కొంత మంది యువకులే ఎంపికయ్యారు. దీంతో వారిని పార్టీలు చేసుకోకుండా త్వరగా నిద్రపోమని ద్రావిడ్ ఆర్డర్ వేశాడు.
మూడు టీ20ల సిరీస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. నవంబరు 25- 29 వరకు ఈ మ్యాచ్ జరగనుండగా.. డిసెంబరు 3- 7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరుగనుంది. ఇక ఈ సిరీస్ నుంచి టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్ విశ్రాంతి తీసుకోగా.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.