ఇప్పటి వరకు ఇండియా, న్యూజిలాండ్ టీ-20ల్లో 22 సార్లు తలపడగా, 12 మ్యాచ్ ల్లో ఇండియా, 9 మ్యాచ్‌ల్లో కివీస్ విజయం సాధించాయి. ఒకటి టైగా ముగిసింది. అయితే నేటి నుంచి ప్రారంభమయ్యే టీ-20 సిరీస్‌లో ఒక ఐదుగురి ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉంది. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు? టీ-20ల్లో వారి ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.
విధ్వంసకర ఆటగాడిగా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ-20ల్లో వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. 2022లో ICC మెన్స్ టీ-20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 31 టీ-20 మ్యాచ్‌ల్లో 46.56 సగటు, 187.43 స్ట్రైక్ రేట్‌తో 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి.
* మైఖేల్ బ్రేస్‌వెల్ : ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో మైఖేల్ బ్రేస్‌వెల్ అద్భుతంగా రాణించాడు. మొదటి వన్డేలో సెంచరీతో చెలరేగి కివీస్‌ను గెలిపించేంత పని చేశాడు. టీ-20 సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించే ఆటగాళ్ల జాబితాలో ఇతను ఒకడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 183.67 స్ట్రైక్ రేట్‌తో 90 పరుగులు చేశాడు. అలాగే 17 వికెట్లు పడగొట్టాడు.
* గ్లెన్ ఫిలిప్స్ : పొట్టి ఫార్మాట్లో కివీస్ కీలక ఆటగాళ్లలో గ్లెన్ ఫిలిప్స్ ఒకడు. వన్డే ఫార్మాట్‌తో పోలిస్తే టీ20ల్లో అతనికి మంచి రికార్డ్ ఉంది. హార్డ్- హిట్టర్‌గా గుర్తింపు పొందిన ఫిలిప్స్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడంటే అతన్ని కట్టడి చేయడం చాలా కష్టం. దీంతో భారత బౌలర్లు ఫిలిప్స్‌ను ఎంత త్వరగా ఔట్ చేస్తే అంత మంచిది. ఫిలిప్స్ ఇప్పటివరకు టీ-20ల్లో 148.26 స్ట్రైక్ రేట్‌తో 1361 పరుగులు చేశాడు. భారత్‌పై అతనికి మంచి రికార్డ్ ఉంది. పది మ్యాచ్‌ల్లో 167.92 స్ట్రైక్ రేట్ తో 356 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 40గా ఉంది. న్యూజిలాండ్ టీమ్ ఫిలిప్స్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది.