IND vs NZ First T20I : టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో ధోని శిష్యుడు దూరం.. పాపం, ఆ కుర్రాడు!
IND vs NZ First T20I : టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో ధోని శిష్యుడు దూరం.. పాపం, ఆ కుర్రాడు!
IND vs NZ First T20I : రాంచీ వేదికగా శుక్రవారం నుంచి మూడు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ (New Zealand) ను 3-0 తో మట్టికరిపించిన టీమిండియా (Team India) ఇప్పుడు ధనాధన్ పోరుకు రెడీ అయింది. హార్దిక్ నేతృత్వంలోని యంగ్ ఇండియా న్యూజిలాండ్ కు సవాల్ విసురుతుంది. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి మూడు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
2/ 7
అయితే.. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య రంజీ మ్యాచ్ సందర్భంగా అతని మణికట్టుకు గాయమైంది.
3/ 7
దీంతో అతను టీమిండియాతో కలవకుండా నేషనల్ క్రికెట్ అసోసియేషన్‌కు వెళ్లాడు. దీంతో.. కివీస్ సిరీస్ కు రుతురాజ్ దూరమయ్యాడు. అయితే.. రుతురాజ్ స్థానంలో ఎవర్నీ ఎంపిక చేయలేదు బీసీసీఐ.
4/ 7
ఇప్పటికే పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి రూపంలో బ్యాకప్ ఓపెనర్లు ఉండటంతో రుతురాజ్ స్థానంలో ఎవర్నీ ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారి తెలిపారు. ఇక.. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు జట్టులోకి ఎంపికైనా.. బెంచ్ కే పరిమితమయ్యాడు రుతురాజ్.
5/ 7
ఇప్పుడు గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అదృష్టం వచ్చి హ్యాండ్ ఇచ్చే లోపు.. దురదృష్టం మనోడిని కౌగిలించుకుంటుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ , ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తున్న రుతురాజ్ కు టీమిండియాలో మాత్రం సరైన ఛాన్సులు దక్కలేదు.
6/ 7
ఇక, ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ విశ్రాంతి తీసుకోనుండగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు బరిలోకి దిగనుంది.
7/ 7
వన్డే సిరీస్ తరహాలోనే టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. సీనియర్ల గైర్హాజరీలో టీమిండియా టీమ్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, ఈ సిరీస్ లో కూడా క్లీన్ స్వీప్ చేస్తే టీ20ల్లో కూడా టీమిండియా నెం.1 కానుంది.