లంచ్ తర్వాత కివీస్ రక్షణాత్మక ధోరణిలో ఆడింది. పరుగులు రాకపోయినా.. టీమ్ ఇండియా బౌలర్లను మాత్రం డిఫెన్స్‌తో అడ్డుకున్నారు. ఒకసారి పటేల్ బౌలింగ్‌లో రాస్ టేలర్అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే రాస్ టేలర్ (11) పటేల్ బౌలింగ్‌లో కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.. (BCCI Photo)
చివరి సెషన్లో మిగిలిన సమయంలో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. రెండో ఓవర్లోనే కైల్ జేమిసన్ భారత జట్టును ఎదురు దెబ్బ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ (1) కైల్ జేమిసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆటను మూడో రోజు ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. భారత జట్టు ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. (BCCI Photo)