సూర్య భాయ్ తన ప్రతాపం ఈ మ్యాచులో కూడా కొనసాగిస్తే.. రోహిత్ శర్మ రికార్డు బద్దలవ్వడమే కాకుండా.. టీమిండియా సిరీస్ కూడా కైవసం చేసుకుంటుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో మ్యాచ్లో సూర్య జోరుతో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఇక, మూడో మ్యాచ్ తో సిరీస్ ఫలితం తేలనుంది.
2019లో రోహిత్ అత్యధికంగా 78 సిక్సర్లు బాదాడు. వన్డే, టెస్టు, టీ20 మూడు ఫార్మాట్లలో సిక్సర్లున్నాయి. అదే సమయంలో, 2018లో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో 74 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు సూర్య మొత్తం 70 సిక్సర్లు కొట్టాడు. అయితే, రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టాలంటే సూర్య కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.