Team India : భువనేశ్వర్ కుమార్ కు ఝలక్ ఇచ్చిన చహల్.. ఇప్పుడు టీమిండియా నంబర్ వన్ ఇతడే?
Team India : భువనేశ్వర్ కుమార్ కు ఝలక్ ఇచ్చిన చహల్.. ఇప్పుడు టీమిండియా నంబర్ వన్ ఇతడే?
Team India : తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఛేజింగ్ లో భారత్ కూడా చాలా ఇబ్బందులు పడింది. చివరకు 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసి నెగ్గింది.
లక్నో వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా (Team India) 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. దాంతో అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న జరిగే మూడో టి20 సిరీస్ విజేతను తేల్చనుంది.
2/ 7
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఛేజింగ్ లో భారత్ కూడా చాలా ఇబ్బందులు పడింది. చివరకు 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసి నెగ్గింది.
3/ 7
సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 26 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉండి భారత్ గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే హవా. ఇరు జట్లలోనూ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
4/ 7
గత కొంతకాలంగా పేలవ ఫామ్ లో ఉన్న యుజువేంద్ర చహల్ బెంచ్ కే పరిమితం అవుతూ వస్తున్నాడు. అయితే రెండో టి20లో అతడు టీమిండియా తుది జట్టులోకి వచ్చాడు.
5/ 7
ఈ క్రమంలో చహల్ అరుదైన రికార్డును అందుకున్నాడు. రెండో టి20లో రెండు ఓవర్లు వేసిన చహల్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకర ఫిన్ అలెన్ వికెట్ ను తీశాడు.
6/ 7
ఈ క్రమంలో భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. చహల్ 75 మ్యాచ్ ల్లో 91 వికెట్లు తీశాడు. దాంతో నిన్నటి వరకు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
7/ 7
భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్ ల్లో 90 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 72 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.