SuryaKumar Yadav : మండేందుకు సిద్ధమైన సూరీడు.. మరో 63 పరుగులు చేస్తే చాలు.. మూడో టి20లో సాధిస్తాడా మరీ?
SuryaKumar Yadav : మండేందుకు సిద్ధమైన సూరీడు.. మరో 63 పరుగులు చేస్తే చాలు.. మూడో టి20లో సాధిస్తాడా మరీ?
SuryaKumar Yadav : దాంతో అతడు అటు వన్డే, ఇటు టెస్టులకు ఎంపికై ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనిపించుకున్నాడు. వన్డేల్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయినా టి20ల్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.
లేటు వయసులో టీమిండియా (Team India) తరఫున అరంగేట్రం చేసిన సూర్యకుమర్ యాదవ్ (SuryaKumar Yadav) టి20ల్లో రెచ్చిపోతున్నాడు. మిస్టర్ 360గా అవతరించాడు. గతేడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
2/ 8
దాంతో అతడు అటు వన్డే, ఇటు టెస్టులకు ఎంపికై ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనిపించుకున్నాడు. వన్డేల్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయినా టి20ల్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.
3/ 8
ఇక న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20లో కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. తొలి టి20లో 47 పరుగులు చేసిన అతడు.. స్పిన్ కు అనుకూలిస్తున్న లక్నో పిచ్ ప్ ఓపిగ్గా బ్యాటింగ్ చేసి భారత్ ను గెలిపించాడు.
4/ 8
ప్రస్తుతం టి20ల్లో నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఈ క్రమంలో అతడిని ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగే మూడో టి20లో అతడు అది సాధిస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
5/ 8
మూడో టి20లో సూర్యకుమార్ యాదవ్ మరో 63 పరుగులు చేస్తే చాలు.. న్యూజిల్యాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో అతను రెండో స్థానానికి చేరతాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో కివీస్‌పై సూర్య 260 పరుగులు చేశాడు.
6/ 8
ఈ జాబితాలో ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ 322 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇతడిని అధిగమించాలంటే సూర్య మరో 63 పరుగులు చేయాలి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 511 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
7/ 8
సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ముగియగా.. తొలి టి20లో న్యూజిలాండ్ గెలిస్తే.. రెండో టి20లో టీమిండియా గెలిచింది. దాంతో సిరీస్ విజేత అహ్మదాబాద్ లో తేలనుంది. ఇక ఈ సిరీస్ లో ఇప్పటి వరకు అసలు సిసలు మెరుపులు కనిపించలేదు.
8/ 8
మూడో టి20 కోసం బ్యాటింగ్ వికెట్ ను తయారు చేసినట్లు సమాచారం. దాంతో ఆఖరి టి20లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.