వాస్తవానికి శుబ్ మన్ గిల్ పుల్ షాట్లను చక్కగా ఆడగలడు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో గిల్ ఫుల్ షాట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ లో డబుల్ సెంచరీ.. మరో మ్యాచ్ లో సెంచరీ చేస్తాడు. వన్డే సిరీస్ లో గిల్ ఎక్కడా ఇబ్బంది పడ్డ దాఖలాలు లేవు. అంతేకాకుండా గిల్ ఒక్కసారి కూడా స్పిన్నర్ కు అవుటవ్వలేదు.
అయితే టి20 సిరీస్ కు వచ్చేసరికి గిల్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి రెండు టి20ల్లో పేలవ ప్రదర్శన చేశాడు. రెండు సార్లు కూడా స్పిన్నర్లకే అవుటయ్యాడు. ముఖ్యంగా స్లోగా.. ఎక్కువ బౌన్స్ తో టర్న్ అవుతూ వచ్చే బంతులను ఆడటంలో గిల్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వీటిని ఎంత త్వరగా సరి చేసుకుంటే అతడి పొట్టి పార్మాట్ కెరీర్ కు మంచిది.