అయితే ఈ కార్యక్రమానికి కెప్టెన్ షఫాలీ వర్మ, రిచా ఘోష్ లు దూరమయ్యే ఛాన్స్ ఉంది. వీరిద్దరూ మహిళల టి20 ప్రపంచకప్ కు ప్రకటించిన టీమిండియా జట్టులో భాగంగా ఉన్నారు. ఈ క్రమంలో వారు అక్కడే ఉండిపోయినట్లు సమాచారం. మహిళల టి20 ప్రపంచకప్ కూడా దక్షిణాఫ్రికా వేదికగానే ఫిబ్రవరి 10 నుంచి ఆరంభం కానుంది.