IND vs NZ : చావో రేవో అంటే చాలు ఈ టీమిండియా ప్లేయర్స్ రెచ్చిపోతారు.. డిసైడర్ లో మెరిసేదెవరో మరీ?
IND vs NZ : చావో రేవో అంటే చాలు ఈ టీమిండియా ప్లేయర్స్ రెచ్చిపోతారు.. డిసైడర్ లో మెరిసేదెవరో మరీ?
IND vs NZ 3rd T20 : సిరీస్ ను కాపాడుకోవాలన్నా.. లేకుంటే సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్ లను డిసైడర్స్ అంటారు. అలాంటి పరిస్థితిని డూ ఆర్ డై గా అభివర్ణిస్తారు. ఇక ఇది ప్రపంచకప్ లో అయితే మరింత సీరియస్ గా ఉంటుంది.
క్రికెట్ లో చావో రేవో లాంటి పరిస్థితులు అనేకం ఎదురవుతాయి. ప్రపంచకప్ (World Cup 2022)లాంటి మెగా టోర్నీల దగ్గర నుంచి ద్వైపాక్షిక సిరీస్ వరకు ఇలాంటి పరిస్థితులను ప్లేయర్స్ చాలా సార్లే ఎదుర్కొని ఉంటారు.
2/ 8
సిరీస్ ను కాపాడుకోవాలన్నా.. లేకుంటే సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్ లను డిసైడర్స్ అంటారు. అలాంటి పరిస్థితిని డూ ఆర్ డై గా అభివర్ణిస్తారు. ఇక ఇది ప్రపంచకప్ లో అయితే మరింత సీరియస్ గా ఉంటుంది.
3/ 8
ప్రస్తుతం ఇటువంటి పరిస్థితినే టీమిండియా ఎదుర్కొంటుంది. న్యూజిలాండ్ తో జరిగే మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా.. ఇందులో తొలి టి20లో కివీస్ నెగ్గితే.. రెండో టి20లో భారత్ నెగ్గింది.
4/ 8
దాంతో సిరీస్ విజేతను అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో టి20 నిర్ణయించనుంది. అంతర్జాతీయ టి20ల్లో డిసైడర్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
5/ 8
ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మూడో టి20లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. మూడో టి20లో తన వీరోచిత సెంచరీతో భారత్ కు సిరీస్ ను అందజేశాడు.
6/ 8
2018లో ఇంగ్లండ్ తో జరిగి కీలకమైన టి20 మ్యాచ్ లో రోహిత్ శర్మ అజేయ సెంచరీ (100 నాటౌట్)తో రాణించాడు. ఈ మ్యాచ్ లో భారత్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. 2019లో వెస్టిండీస్ పై కేఎల్ రాహుల్ (91 నాటౌట్) మూడో స్థానంలో ఉన్నాడు.
7/ 8
ఇక 2021లో ఇంగ్లండ్ తో జరిగిన మరో డూ ఆర్ డై మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 80 పరుగులతో టీమిండియాను గెలిపించాడు. ఈ లెక్కన డూ ఆర్ డై మ్యాచ్ లో మన ప్లేయర్స్ ఎప్పుడూ తమ బ్యాట్ కు పని చెబుతూనే ఉన్నారు.
8/ 8
అయితే కివీస్ తో జరిగే టి20 సిరీస్ లో రోహిత్, కోహ్లీ, రాహుల్ లు ఆడటం లేదు. ఈ లెక్కన కివీస్ పై భారత్ నెగ్గాలంటే భారమంతా సూర్యకుమార్ యాదవ్ పైనే ఉండనుంది.