ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20లో హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయం మరోసారి చర్చకు తెరలేపింది. స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై యుజ్వేంద్ర చాహల్‌తో పూర్తి కోటా ఓవర్లను వేయించలేదు. కుల్దీప్ యాదవ్, దీపక్ హుడాలతో ఫుల్ కోటా వేయించిన పాండ్యా.. చాహల్‌కు మాత్రం రెండు ఓవర్లే ఇచ్చాడు. దీనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
స్పిన్‌కు అనుకూలించిన ఈ పిచ్ పై చాహల్‌కు గనక ఫుల్ కోటా ఇచ్చుంటే కివీస్.. 80-85 పరుగులకే పరిమితమై ఉండేది. అలాగాక హుడాతో నాలుగు ఓవర్లు వేయించాడు.'అని చెప్పాడు. హార్ధిక్ పాండ్యా నాలుగు ఓవర్లు విసిరి అత్యధిక పరుగులు సమర్పించుకోవడానికి బదులుగా తన ఓవర్లను అతడు చాహల్‌కు ఇస్తే బాగుండేదని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.