Team India : సంజూ సామ్సన్ పై రవిశాస్త్రి సంచలన కామెంట్స్.. అలా చేసి చూడండి అంటూ హితవు
Team India : సంజూ సామ్సన్ పై రవిశాస్త్రి సంచలన కామెంట్స్.. అలా చేసి చూడండి అంటూ హితవు
Team India : జట్టు ఆడే ప్రధాన సిరీస్ లకు ఇతడు దూరంగానే ఉంటున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సమయాల్లోనే టీమిండియాకు ఎంపికవుతున్నాడు. అప్పుడు కూడా అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో రెగ్యులర్ గా చోటు దక్కుతుందా అంటే లేదనే చెప్పాలి.
సంజూ సామ్సన్ (Sanju Samosn).. టెక్నిక్ తో పాటు దూకుడుగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్. టీంలో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్. ఎంతో ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ కు అవకాశాలు అయితే రావడం లేదు.
2/ 8
జట్టు ఆడే ప్రధాన సిరీస్ లకు ఇతడు దూరంగానే ఉంటున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సమయాల్లోనే టీమిండియాకు ఎంపికవుతున్నాడు. అప్పుడు కూడా అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో రెగ్యులర్ గా చోటు దక్కుతుందా అంటే లేదనే చెప్పాలి.
3/ 8
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో సంజూ సామ్సన్ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో టి20, వన్డే సిరీస్ లకు ఎంపికయ్యాడు.
4/ 8
రెండో టి20లో అతడు ఆడతాడని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. ఇక బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు. ఈ క్రమంలో ఎంతో ట్యాలెంట్ ఉన్న సంజూ సామ్సన్ ను ఉపయోగించుకోవడంలో టీమిండియా విఫలం అవుతుందనే చెప్పాలి.
5/ 8
ఫామ్ లో లేకుండా జట్టుకు భారంగా తయారైన పంత్ కు మాత్రం వరుస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు. అతడికి ఇచ్చినన్ని అవకాశాల్లో కనీసం పావు వంతైనా సామ్సన్ కు ఇచ్చి ఉంటే టీమిండియాకు మంచి జరిగి ఉండేదని అభిమానులు పేర్కొంటున్నారు.
6/ 8
ఇక తాజాగా సంజూ సామ్సన్, టీమిండియా మధ్య జరుగుతున్న రచ్చలో మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంట్రీ ఇచ్చాడు. సామ్సన్ ను వరుసగా ఆడించాలని టీమిండియాకు హితవు పలికాడు.
7/ 8
కనీసం ఒక 10 మ్యాచ్ ల్లో సంజూ సామ్సన్ ను డ్రాప్ చేయించకుండా ఆడించాలనే ప్రతిపాదనను చేశాడు. రెండు మ్యాచ్ లు ఆడించడం ఆ తర్వాత అతడిని డ్రాప్ చేయడం కాదని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
8/ 8
వేరే వాళ్లను డ్రాప్ చేసి సంజూ సామ్సన్ కు వరుసగా ఒక 10 మ్యాచ్ ల్లో అవకావశం ఇవ్వాలని కోరాడు. అప్పుడు అతడి ప్రదర్శనను చూసి సామ్సన్ కు అవకాశం ఇవ్వాలే లేక వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయానికి రావాలని టీమిండియాకు సూచించాడు.