Team India : ఈ ప్లేయర్ ఉన్నాడే! ఐపీఎల్ కి ఎక్కువ.. టీమిండియాకు తక్కువ.. ఏం మారలేదు
Team India : ఈ ప్లేయర్ ఉన్నాడే! ఐపీఎల్ కి ఎక్కువ.. టీమిండియాకు తక్కువ.. ఏం మారలేదు
Team India : టి20 సిరీస్ విజేతను నిర్ణయించే డిసైడర్ మ్యాచ్ లో భారత్ చెలరేగిపోయింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ ఏకంగా 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
2023లో టీమిండియా (Team India) తన జోరును కొనసాగిస్తుంది. ఇప్పటికే శ్రీలంక (Sri Lanka)తో జరిగిన టి20, వన్డే సిరీస్ లను సొంతం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్ పైన కూడా అదే దూకుడును ప్రదర్శించింది.
2/ 8
టి20 సిరీస్ విజేతను నిర్ణయించే డిసైడర్ మ్యాచ్ లో భారత్ చెలరేగిపోయింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ ఏకంగా 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
3/ 8
ఇక యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ 63 బంతుల్లోనే 126 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. తనకు టి20 ఫార్మాట్ సెట్ కాదన్న వారికి గట్టిగా సమాధానం చెప్పాడు. ఇక బౌలింగ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 వికెట్లతో చెలరేగిపోయాడు.
4/ 8
అయితే ఒక ప్లేయర్ విషయంలో మాత్రం అభిమానులు అస్సలు ఆనందంగా లేరు. అతడే ఇషాన్ కిషన్.. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాది అందరిచేత ప్రశంసలు అందుకున్న ఈ యువ ఓపెనర్.. ఇప్పుడు పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు.
5/ 8
ముఖ్యంగా టి20ల్లో ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. 27 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో కేవలం 653 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ తో జరిగిన మూడో టి20లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిరిగాడు.
6/ 8
కివీస్ తో జరిగిన టి20 సిరీస్ లో ఇషాన్ కిషన్ వరుసగా 4, 19, 1 పరుగులు చేశాడు. ఇక అంతకుముందు ఇదే జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. గిల్ శతకాలు బాదిన పిచ్ పై ఇషాన్ కిషన్ మాత్రం 5, 8, 17 పరుగులు చేశాడు.
7/ 8
ఇక ఇషాన్ కిషన్ తన చివరి 10 అంతర్జాతీయ టి20లను చూస్తే.. 8, 11, 36, 10, 37, 2, 1, 4, 19, 1 పరుగులు చొప్పున చేశాడు. కేవలం మూడు సార్లు మాత్రమే డబుల్ డిజిట్ ను చేరుకున్నాడు. అయినా ఇషాన్ కిషన్ ను మాత్రం మేనేజ్ మెంట్ బ్యాకప్ చేస్తూనే ఉంది.
8/ 8
ఐపీఎల్ లో అదరగొట్టే ఈ ప్లేయర్.. టీమిండియాకు వచ్చే సరికి జీరోగా మారిపోతున్నాడు. బంగ్లాదేశ్ పై వన్డే డబుల్ సెంచరీ మినహా ఇషాన్ కిషన్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఇక టి20లకు వస్తే అది కూడా లేదు.