లోపలికి వచ్చే బంతిని ఎదుర్కొనడంలో కోహ్లీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అయితే బయటకు వెళ్లే బంతులను ఆడే సమయంలో మాత్రం బీట్ అవుతున్నాడు. ఈ క్రమంలో లెఫ్టార్మ్ స్పిన్నర్లకు.. లెగ్ స్పిన్నర్లకు అవుటవుతున్నాడు. అయితే త్వరలోనే లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో కోహ్లీ మెరుగవుతాడని అతడి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.