IND vs NZ : కుంభ స్థలాన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమైన టీమిండియా.. మూడో వన్డేలో గెలిస్తే చరిత్రే
IND vs NZ : కుంభ స్థలాన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమైన టీమిండియా.. మూడో వన్డేలో గెలిస్తే చరిత్రే
IND vs NZ : కివీస్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలు నెగ్గిన భారత్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఒక అరుదైన ఘనతకు చేరువైంది.
2023లో టీమిండియా (Team India) దూకుడు మీదుంది. వరుస పెట్టి సిరీస్ లను సాధించేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే శ్రీలంక (Sri Lanka)పై టి20, వన్డే సిరీస్ లను నెగ్గిన భారత్ (India).. తాజాగా న్యూజిలాండ్ (New Zealand) పని కూడా పట్టింది.
2/ 8
కివీస్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలు నెగ్గిన భారత్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఒక అరుదైన ఘనతకు చేరువైంది.
3/ 8
ప్రస్తుతం ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారత్ మూడో స్థానంలో ఉంది. 113 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. టాప్ ర్యాంకర్ గా భారత్ లో అడుగుపెట్టిన కివీస్ తొలి రెండు వన్డేల్లో ఓడి రెండో స్థానానికి పడిపోయింది.
4/ 8
ఇక టీమిండియా పుణ్యమా అని రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కాస్తా టాప్ ర్యాంక్ కు చేరుకుంది. అయితే ఇక్కడ ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ జట్లు 113 రేటింగ్ పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే దశాంశ స్థానాల్లో వ్యత్యాసం వలన ఇంగ్లండ్ టాపర్ గా నిలిచింది.
5/ 8
ఇక మంగళవారం జరిగే మూడో వన్డేలో భారత్ విజయం సాధిస్తే వన్డేల్లో భారత్ నంబరవన్ జట్టుగా అవతరిస్తుంది. ప్రస్తుతం భారత్ టి20ల్లో నంబర్ వన్ గా ఉంది. వన్డేల్లోనూ అది సాధిస్తే ఒకే సమయంలో అటు వన్డే, ఇటు టి20ల్లో నంబర్ వన్ జట్టుగా ఉంటుంది.
6/ 8
ఇక టెస్టుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ లో ఉంది. ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడాల్సి ఉంది. ఇందులో భారత్ నెగ్గితే టెస్టుల్లో కూడా టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ ను అందుకునే అవకాశం ఉంది.
7/ 8
అదే జరిగితే ఒకే సమయంలో మూడు ఫార్మాట్లలోనూ భారత్ నంబర్ వన్ జట్టుగా ఉండే అరుదైన అవకాశాన్ని సాధిస్తుంది. అయితే భారత్ వన్డేల్లో తన నంబర్ వన్ ర్యాంక్ ను కాపాడుకోవాలి అంటే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ ను గెలవడంతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు తాము ఆడే వన్డే సిరీస్ ల్లో ఓడాల్సి ఉంటుంది.
8/ 8
ఏదీ ఏమైనా మంగళవారం జరిగే చివరి వన్డేలో భారత్ నెగ్గితే మాత్రం ఒకే సమయంలో వన్డే, టి20ల్లో నంబర్ వన్ జట్టుగా భారత్ అవతరిస్తుంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం గం. 1.30లకు ఆరంభం కానుంది.